హరీశ్ రావుకు విద్యపై మాట్లాడే నైతిక హక్కు లేదు – ఆకునూరి మురళి Ex IAS




హరీశ్ రావుకు విద్యపై మాట్లాడే నైతిక హక్కు లేదు – ఆకునూరి మురళి Ex IAS

 నేటి ఇజం:న్యూస్ ప్రతినిధి కమలాపూర్  మార్చ్ 1:

తెలంగాణలో మీ పది సంవత్సరాల పాలనలో ప్రభుత్వ విద్యను భ్రష్టు పట్టించిన మీకు విద్య గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి Harish Raoపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకురూరి మురళి ex ఐఏఎస్ కమిషన్ నివేదిక మొదటి పేజీ కూడా చదవనట్టుగా వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరమని మండిపడ్డారు.

కమిషన్ రిపోర్ట్‌లో ఉన్న అంశాలపై మాట్లాడకుండా, మా టీం విద్యార్హతలపై ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. “మమ్మల్ని అడిగితే మా అందరి CVలు ఇచ్చేవాళ్లం కదా” అని స్పష్టం చేశారు.

మా ఆఫీస్ టీంలోనే 6 మంది పీహెచ్‌డీ విద్యావంతులు (అందరూ బోధనా అనుభవం కలిగినవారు) ఉన్నారని తెలిపారు. అదనంగా ఒకరు National Institute of Technology (NIT), ఒకరు Institute of Rural Management Anand (IRMA), మరొకరు London School of Economicsలో Public Policy చదివినవారని వివరించారు. మొత్తం 22 మంది ప్రొఫెసర్లు—అందరూ విద్యావేత్తలే—వర్కింగ్ గ్రూపుల ద్వారా ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు.

“ఆకునూరి మురళి ఒక్కడే రిపోర్ట్ రాయడు. పాలసీ రీసెర్చ్ ఎలా జరుగుతుందో తెలియకుండానే ఆరోపణలు చేయడం సరికాదు” అంటూ విమర్శించారు. కమిషన్ ఎలా పనిచేసిందో, ఏ విధంగా విశ్లేషణ చేసి నివేదిక తయారు చేసిందో వివరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. నెలకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించడం, కమిషన్ ఏర్పాటు చేయడం, విశ్వవిద్యాలయాలకు వైస్‌చాన్సలర్లను నియమించడం, 10,000 కొత్త ఉపాధ్యాయులను నియమించడం వంటి చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. “ex సీఎం చంద్రశేఖర్ రావు ఒక్క గంటైనా విద్యపై సమీక్ష పెట్టారా?” అని ప్రశ్నించారు.

విద్యా అంశాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలని, ఆరోపణలు చేసే ముందు పూర్తి హోమ్‌వర్క్ చేసుకోవాలని సూచించారు.komuraiahramadugu12@gmail.com


Post a Comment

0 Comments