మంచిర్యాల శ్రీరాంపూర్ ఆరవ డివిజన్లో బిజెపి అభ్యర్థి వనపర్తి కేత రాజేష్ ఇంటింటి ప్రచారం భారీ ర్యాలీ




 

నేటి ఇజం: శ్రీరాంపూర్: 9/2/2026

మంచిర్యాల మున్సిపాలిటీ ఆరవ డివిజన్లో బిజెపి అభ్యర్థి వనపర్తి కేత రాజేష్ ఇంటింటి ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆరవ డివిజన్ పరిధిలో తమను పూర్తి మెజారిటీతో గెలిపిస్తే యువత కోసం ఉద్యోగ అవకాశాలు, గ్రంధాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీరాంపూర్ కాలనీ కొత్త రోడ్డు పోచమ్మ గుడి నుండి శ్రీరాంపూర్ బస్టాండ్ వరకు రోడ్డు వెడల్పు పనులను చేపడతామన్నారు. నీటి సమస్యలు పరిష్కరించి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, ప్రజల ఆరోగ్య సమస్యలపై మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, సింగరేణి ప్రాంతంలో ఇండ్ల పట్టాలి రాని వారికి పట్టాలు ఇప్పించడానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అర్హులైన వృద్ధులకు, దివ్యాంగులకు ప్రభుత్వ పెన్షన్లు రేషన్ కార్డులు ఇప్పిస్తామన్నారు. ఆరవ డివిజన్ పరిధిలో పిల్లల కోసం పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. స్థానికంగా బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. డివిజన్ పరిధిలో నిరుపేద కుటుంబంలో ఆడపిల్ల పెళ్లికానుకగా ఐదువేల రూపాయలు, ఆడపిల్ల జన్మిస్తే చిన్నారి తల్లి కానుకగా తన సొంత ఖర్చుతో ఐదుగురు 5 వేల రూపాయలు అందిస్తారని హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా మహిళలకు చీరలు తన సొంత అందిస్తారని పేర్కొన్నారు. 6వ డివిజన్ అభివృద్ధి కోసం కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Post a Comment

0 Comments