డివిజన్ ప్రజల సంక్షేమమే నా ధ్యేయం - ఆదర్శ డివిజన్ గా నిలపడమే నా లక్ష్యం
ప్రజల గొంతు నవుతా - 5 డివిజన్లో గలమెత్తిన శ్రీలత రాజ
చీపురు గుర్తుతో మార్పుకు పిలుపు
నేటి ఇజం: 2/9/2026/శ్రీరాంపూర్
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ఆరవ డివిజన్ రాజకీయంగా హోరెత్తుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా తలారి కళ్యాణి-సమ్మయ్య బరిలోకి దిగడంతో పోటీ కొత్త మలుపు తిరిగింది. ప్రజాసమస్యలపై దూకుడైన స్వరంతో మాట్లాడిన ఇరువూరు, ఈసారి గెలుపు సాధించి ప్రజల గళంగా నిలుస్తానని స్పష్టంగా ప్రకటించారు. కార్పొరేటర్‌గా డివిజన్ అభివృద్ధికి నడుం బిగిస్తానని కళ్యాణి-సమ్మయ్య ధీమా వ్యక్తం చేశారు.“కార్పొరేటర్ పదవి ప్రజల కోసం ప్రశ్నించే గొంతు కావాలి… ఆ బాధ్యతను నేను తీసుకుంటా” అంటూ సూటిగా చెప్పారు.
డివిజన్‌లో ప్రధాన సమస్యలైన వీధిదీపాల కొరత, డ్రైనేజీ అవస్థలు, రోడ్ల దుస్థితిపై ప్రత్యేకంగా దృష్టి పెడతానని ప్రకటించారు. సమస్యలు వచ్చి చెబుతారని ఎదురుచూడను… సమస్యల ముందే నేనే నిలబడి పరిష్కారం తీసుకొస్తాను అని దూకుడుగా వ్యాఖ్యానించారు.
సామాజిక సంక్షేమంపై కూడా స్పష్టమైన హామీలు ఇచ్చారు.
పదవ తరగతి పేద విద్యార్థుల పరీక్ష ఫీజులు చెల్లించడం
గురుకులాల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక కృషి
ప్రతి నెల డివిజన్ ప్రజల కోసం ఉచిత వైద్య పరీక్షలు
నిరుద్యోగ యువతి–యువకులకు వివిధ కంపెనీలతో కలిసి జాబ్ మేళాలు
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం స్థిరమైన లైబ్రరీ ఏర్పాటు
ప్రజల సమస్యలు వినేందుకు 24 గంటలు అందుబాటులో ఉండే కార్యాలయం ఏర్పాటు
అని వరుస హామీలతో తలారి కళ్యాణి-సమ్మయ్య ప్రజలను ఆకట్టుకున్నారు.
“డబ్బుతో కాదు… అనుభవంతో, పోరాటంతో వచ్చిన నాయకత్వాన్ని గుర్తించండి. ఆర్థికంగా ఎదగడానికి వచ్చే వారిని కాదు, ప్రజల కోసం నిలబడిన వ్యక్తిని గెలిపించండి” అంటూ ప్రత్యర్థులపై పరోక్ష విమర్శలు గుప్పించారు.
చీపురు గుర్తుకు ఓటు వేసి ఆరవ డివిజన్ అభివృద్ధికి తోడ్పడండి అని ప్రజలకు మనస్ఫూర్తిగా పిలుపునిస్తూ, ఈసారి ఆరవ డివిజన్‌లో మార్పు తప్పదని వారు ధీమాగా ప్రకటించారు.రెండు వేర్వేరు డివిజన్ లలో అక్క చెల్లెల్లు కార్పొరేటర్ బరిలో నిలవడం కోసమేరుపు.


0 Comments