నస్పూర్ష్ట ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాల ద్వారా మాత్రమే ప్రజల సంక్షేమం సాధ్యమవుతుందని మంచిర్యాల జిల్లా మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ .


 రాష్ట్ర ప్రజల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం 

మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

నేటి ఇజం: నస్పూర్

రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాల ద్వారా మాత్రమే ప్రజల సంక్షేమం సాధ్యమవుతుందని మంచిర్యాల జిల్లా మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూముల నరేష్ ను గెలిపించాలని ఆ ప్రాంత ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చెయ్యి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అంతకు ముందు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంతో జై.. యూత్ కాంగ్రెస్ నినాదాలతో మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మకు కలవేన సిద్ధార్థ, వేల్పుల ప్రవీణ్, రౌతు సత్యనారాయణ, పులి బీమయ్య లు శాలువాను కప్పి ఘనంగా ఆహ్వానించారు.

Post a Comment

0 Comments