ఓదెల మల్లికార్జునస్వామి వారి ఆశీస్సులతో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
కుటుంబ సమేతంగా ఓదెల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న.
పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు
నేటి ఇజం: 13/02/2026/ఓదెల
ఓదెల మండలంలోని ప్రసిద్ధపుణ్యక్షేత్రం ఓదెల శ్రీ. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల కల్యాణోత్సవం సందర్బంగా శుక్రవారం రోజున కుటుంబ సమేతంగా స్వామి వారికీ పట్టు వస్త్రాలు సమర్పించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణా రావు గారు...
ముందుగా ఆలయ కమిటీ సభ్యులు మరియు అర్చకులు కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే విజయరమణా రావు గారికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు...
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చీకట్ల మొండయ్య, కమిటీ సభ్యులు మరియు మండల పార్టీ అధ్యక్షులు మరియు పలు గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..




0 Comments