కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలి ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి



 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి


నేటి ఇజం: పెద్దపల్లి:12/02/2026


దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్తూపం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 

ఈ నిరసన కార్యక్రమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI), తెలంగాణ ప్రజా ఫ్రంట్ (TPF), రైతు కూలి సంఘం, AIFTU  సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కార్మికుల హక్కులు కనీస వేతనాలు, సమ్మె చేసుకొనే హక్కు, పని గంటల పెంపు వ్యతిరేకంగా తీసుకువచ్చిన 4 కోడ్ లను రద్దు కోసం పోరాడాలని అన్నారు. ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన వీబి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలనీ బడ్జెట్ కేటాయింపులు పూర్తి స్తాయిలో కేంద్రమే భరించాలని, రాష్ట్రాల వాటా పెంపు అంటే చట్టాన్ని ఎత్తివేసే కుట్ర అని అన్నారు. విద్యుత్ సంస్కరణ ల పేరుతొ పేదల నడ్డి విరిచే తీసుకువచ్చిన విద్యుత్ సవరణ చట్టం ను రద్దు చేయాలనీ అన్నారు. అమెరికా తో కుదుర్చుకున్న వ్యవసాయ,వాణిజ్య ఒప్పందాల వాళ్ళ భారత వ్యవసాయ, రైతాంగ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని అన్నారు. 


ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలనీ, ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని, విద్యుత్ సవరణ చట్టంను భారత వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే అమెరికా తో చేసుకున్న వ్యవసాయ, వాణిజ్య ఒప్పందాల  నుండి వైదొలగాలని డిమాండ్ చేశారు.

మధ్యభారతం లో జరుగుతున్న ఆదివాసీల హననం ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


ఈ కార్యక్రమం లో సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుమ్మడి కొమరయ్య, తెలంగాణ రైతుకూలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెలుతురు సదానందం, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్, Cpiml జిల్లా నాయకులు కోరేపు రాజయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments