మందమర్రి పోలీస్ స్టేషన్: నేటి ఇజం: 26/02/2026
మద్యం బానిసై, జల్సాల కోసం పక్కా ప్లాన్‌తో దొంగతనం చేసిన దొంగను మందమర్రి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 14.4 గ్రాముల బంగారం, 14 తులాల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై జి. నరేష్ తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం:
మందమర్రి యాపల్‌కు చెందిన జాడి అభిరామ్ (21) కూలి పనులు చేస్తూ జీవించేవాడు. అయితే, అతడికి ఉన్న మద్యపానం అలవాటు, విలాసవంతమైన జీవితం గడపాలనే కోరికతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో జనవరి 30వ తేదీన తన ఇంటి పక్కనే నివసించే సెగ్గం మధు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. బీరువాలో ఉన్న 12.5 గ్రాముల బంగారం నగదును దోచుకున్నాడు.
అంతటితో ఆగకుండా, అదే రోజు పక్కనే ఉన్న దుర్గం నాగలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించి 08 గ్రాముల బంగారం నగదు చోరీ చేశాడు. దొరికిన రూ. 25,000 నగదుతో నేరుగా గోవాకు వెళ్లి అక్కడ విచ్చలవిడిగా జల్సాలు చేశాడు.
పట్టుబడింది ఇలా....
గోవాలో డబ్బులు అయిపోవడంతో, మిగిలిన బంగారాన్ని అమ్మి మళ్లీ జల్సాలు చేయాలని భావించిన అభిరామ్ తిరిగి మందమర్రి చేరుకున్నాడు. గురువారం (ఫిబ్రవరి 26) బంగారం అమ్మేందుకు వెళ్తున్నాడన్న ముందస్తు సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. మందమర్రిలోని CER క్లబ్ వద్ద ఎస్సై జి. నరేష్ తన బృందంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు లక్ష రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
— జి. నరేష్, సబ్ ఇన్‌స్పెక్టర్, మందమర్రి పోలీస్ స్టేషన్.

0 Comments