పోలింగ్ నిర్వహణ కొరకు పూర్తిస్థాయి ఏర్పాట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టరేట్ కుమార్ దీపక్



 పోలింగ్ నిర్వహణ కొరకు పూర్తి స్థాయి ఏర్పాట్లు 

జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ 

ఫిబ్రవరి 10, 2026: నేటి ఇజం:  ప్రతినిధి 


2వ మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరగనున్న పోలింగ్ నిర్వహణ కొరకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని పాత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లలో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో కమిషనర్ అన్వేష్ తో కలిసి ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రాలను సందర్శించి సామాగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు సమన్వయంతో సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోని 1 మున్సిపల్ కార్పొరేషన్, 4 మున్సిపాలిటీలలో ఈ నెల 11వ తేదీన ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని బజార్ ఏరియాలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని చెన్నూర్ పట్టణంలో గల అటవీశాఖ కార్యాలయం వెనుక ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని సూపర్ బజార్ ఏరియాలో గల ఆర్.కె.సి.ఓ.ఎ. క్లబ్ లో సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టి, సామాగ్రిని, సిబ్బందిని సురక్షితంగా కేటాయించిన ప్రకారం పోలింగ్ కేంద్రాలకు తరలించాలని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగే విధంగా సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయడం జరిగిందని, ఈసారి ఎన్నికల నిర్వహణలో పోలీసు శాఖతో పాటు అటవీ, ఆబ్కారీ శాఖ సిబ్బంది సమన్వయం చేసుకొని ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.*

Post a Comment

0 Comments