భూ బాధితులకు పరిహారం చెక్కు అందజేత
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఫిబ్రవరి 10, 2026: నేటి ఇజం
జిల్లాలోని క్యాతనపల్లి మీదుగా చేపట్టిన జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన బాధితులకు పరిహారం అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య తో చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్యాతనపల్లి జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన 19 మందికి చెందిన 1 కోటి 32 లక్షలు 70 వేల 382 రూపాయల చెక్కును వెంకటస్వామి, రజిత లకు అందించడం జరిగిందని తెలిపారు.


0 Comments