హైటెక్ సిటీలోని 227వ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న కార్మిక & మైనింగ్ శాఖ మంత్రి గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారు* మంత్రి గారు తన నివాసం నుంచి నడుచుకుంటూ వెళ్లి ఓటు వేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి





 మంచిర్యాల జిల్లా: నేటి ఇజం: మంచిర్యాల:11/2/2026

మంచిర్యాల జిల్లా హైటెక్ సిటీలోని 227వ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న కార్మిక & మైనింగ్ శాఖ మంత్రి గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారు

మంత్రి గారు తన నివాసం నుంచి నడుచుకుంటూ వెళ్లి ఓటు వేశారు.

మంత్రి వివేక్ వెంకటస్వామి గారి వ్యాఖ్యలు

ప్రజాపాలన ప్రభుత్వంలో ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించబడుతున్నాయని తెలిపారు

కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని అన్నారు.

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినప్పటికీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థంగా అందిస్తున్నదని చెప్పారు.

ప్రస్తుత ప్రజాపాలనలో ఎక్కడా పోలీసు ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీసులను ఉపయోగించి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని విమర్శించారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యాన్ని హరించి, ఎన్నికలు నిర్వహించకుండా బెదిరింపులకు పాల్పడి ఏకగ్రీవాలు చేయించిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు.

ప్రస్తుత ప్రభుత్వంలో ఎలాంటి బెదిరింపులు లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు.


రాష్ట్రవ్యాప్తంగా 85 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.


ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు

Post a Comment

0 Comments