*పెద్దపల్లి మున్సిపల్* *మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో* *పాల్గొన్న మాజీ* *శాసనసభ్యులు దాసరి మనోహర్* *రెడ్డి గారు*. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 4వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి మహేష్‌కు మద్దతుగా *మాజీ* *శాసనసభ్యులు దాసరి మనోహర్* *రెడ్డి





*పెద్దపల్లి మున్సిపల్  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి . మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 4వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి మహేష్‌కు మద్దతుగా మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి ప్రచారం.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 4వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి మహేష్‌కు మద్దతుగా *మాజీ* *శాసనసభ్యులు దాసరి మనోహర్* *రెడ్డి గారు* ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ బిఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.


ఈ సందర్భంగా *దాసరి మనోహర్* *రెడ్డి గారు* మాట్లాడుతూ, గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) గారు అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో తెచ్చిన మార్పులను ప్రజలకు గుర్తు చేశారు. నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం అందించిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు మర్చిపోలేదని తెలిపారు.


అలాగే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ హామీలతో కాలం గడుపుతోందని విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా మాటలతో మాత్రమే పాలన కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వానికి మళ్లీ ఓటు వేయకూడదని ప్రజలకు వివరించారు.


కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థి మహేష్‌ను కౌన్సిలర్‌గా గెలిపించాలని, అప్పుడు మాత్రమే ప్రజల సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుందని *దాసరి మనోహర్* *రెడ్డి గారు* పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో 23 వార్డు అభ్యర్థి శ్యామ్, BRS నాయకులు హరీష్,రాజేష్ కన్నా,మహేందర్,శేఖర్, స్థానికులు ఉన్నారు..

Post a Comment

0 Comments