*ఫిబ్రవరి 12. దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.* *ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ కార్మిక వర్గానికి పిలుపు*



తేది:03/02/2026.

గోదావరిఖని. నేటి ఇజం/03/02/2026


*ఫిబ్రవరి 12. దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.*

 *ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ కార్మిక వర్గానికి పిలుపు*

 

      కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబరు కోడులను రద్దు చేయాలని విద్యుత్తు సవరణ చట్టం, 2025 విబిజి రాంజీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసి లో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించడం లాంటి ప్రమాదకర నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక, ప్రజా, రైతు ,వ్యతిరేక విధానాలను వెనక్కు తీసుకోవాలని కోరుతూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం మొత్తం పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఐ ఐఎఫ్ టి యు ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖని 2A ఇంక్లైన్ వద్ద కార్మికులను కలుస్తూ సమ్మె ప్రచారం చేయడం జరిగింది. 

         ఈ సందర్భంగా *ఐఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ* మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక సంఘాలు, కార్మిక చట్టాలు లేని  దేశంగా మార్చాలని కార్మికులను నిరాయుధలను చేసి పెట్టుబడుదారులు పారిశ్రామికవేత్తలు కార్పొరేటర్లకు అనుగుణంగా మార్పులు తీసుకొచ్చారని అన్నారు. విరోచితంగా పోరాడి ప్రాణత్యాగాలతో సాధించుకున్న 29 చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబరు కోడులను తీసుకువస్తుందని అన్నారు.

       కావున కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను ఉపసంహరించుకునేలా  కార్మిక వర్గం ప్రతిఘటనకు పూనుకోవాలని కార్మిక వర్గానికి ఐ కృష్ణ పిలుపునిచ్చారు. 

        ఈ సమ్మె ప్రచార కార్యక్రమంలో ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర, జిల్లా నాయకులు ఈ నరేష్, ఈదునూరి రామకృష్ణ,ఐ రాజేశం, ఎస్ ప్రసాద్ ఎడ్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments