ఫిబ్రవరి 12న జరుగు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనండిAIFTU రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ T. రత్న కుమార్


ఫిబ్రవరి 12నా దేశవ్యాప్తసమ్మె లో పాల్గొనండి.

 AIFTU రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్

     T. రత్నకుమార్ పిలుపు 

 నేటి ఇజం: పెద్దపల్లి: 8/2/2026

రోజున పెద్దపల్లి జిల్లాకేంద్రం లోని శాంతి నగర్ లో, రైతుకూలీ సంఘం (RCS ),అఖిల భారత కార్మిక సంఘాలసమాఖ్య (AIFTU)ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.

సమావేశానికి ముఖ్య వక్తలు గా AIFTU రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ T. రత్నకుమార్, రైతుకూలీ సంఘం( RCS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తురు సదానందం హాజరై మాట్లాడుతూ.....

ఫిబ్రవరి 12నాడు జరుగు దేశవ్యాప్త సమ్మెలో భవననిర్మాణ కార్మికులు భాగస్వాములు కావాలని, సమ్మెను జయప్రదం చేయాలనీ పిలుపునిచ్చారు.

   కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను AIFTU, రైతుకూలీ సంఘం (RCS )తెలంగాణ రాష్ట్ర కమిటిలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. 29కార్మిక చట్టాలనుమార్చి 4కోడ్ లుగా, 3రైతువ్యతిరేక చట్టాలను అమలు చేయడం వల్ల ఎంతో పోరాట పటిమ, త్యాగాలతో, బలిదానాలతో సాధించుకున్న హక్కులు కనుమరుగపోనున్నాయన్నారు. ప్రభుత్వాలు నేడు సామ్రాజ్యవాద కార్పొరేట్ దళారులకు దాసోహం చెందారన్నారు. పరిశ్రమలను, వ్యవసాయ రంగాలనుధ్వంసం చేస్తు 

స్వదేశీముసుగులోవిదేశీ శక్తులకు పాదాసేవ చేస్తుంది కేంద్రంలోని NDA ప్రభుత్వం అన్నారు. కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా అడవులను, సహజ సంపదలను అప్పగించడం కోసమే ఆపరేషన్ కగార్ పేర నేటికీ నరమేధం కొనసాగుతుందన్నారు.అందులో భాగంగానే 6-2-2026నాడు సిర్వోంచ-గడ్చిరోలీ మధ్యబమ్రాగడ్అడవుల్లో సిపిఐ మావోయిస్టు నాయకులు కామ్రేడ్ లోకేటి చందర్ @ప్రభాకర్ @, పడ్కాల్ స్వామి తో పాటు 7మందిని క్రూరంగా కాల్చి చంపడం జరిగింది రాజ్యాంగంలోని హక్కులు హరించడమే కాక రాజ్యంగన్నే మార్చాలని మను ధర్మాన్ని కొనసాగించాలని బీజేపీ చేసే కుట్రలను దేశావ్యాప్త సమ్మెతో ఎదుర్కొందామన్నారు.

ముఖ్యంగా అసంగటిత కార్మికుల తోపాటు గ్రామీణ పెదలు జీవనోపాధి కోల్పోయే ప్రమాదా ఘంటికాలు మొగుతున్నాయి. కార్మిక రైతు హక్కుల కోసం ఫిబ్రవరి 12నాడు దేశవ్యాప్త సమ్మె ను విజయవంతం చేయాలనీ పిలువునిచ్చారు.

ఈ సమావేశంలోAIFTU నాయకులు బుద్ధుల రమేష్, A. శంకర్,G.సురేష్,రవీందర్ కోరేఫు మల్లేష్, లలిత, మమత, లక్ష్మి పాల్గొన్నారు.

 

Post a Comment

0 Comments