మేడే పోరాట స్ఫూర్తితో నాలుగు లేబర్ కోడ్స్ రద్దుకై పోరాడుదాం
డి బ్రహ్మానందం (IFTU) భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర నాయకులు
శ్రీరాంపూర్ కాలనీ:01/05/2026(నేటి ఇజం)
ఈరోజు శ్రీరాంపూర్ లో 140 వ మే డే సందర్భంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ( IFTU) ఆధ్వర్యంలో శుక్రవారం సంతలో స్తూపం వద్ద తంగళ్ళపల్లి రమేష్ జెండా ఆవిష్కరించడం జరిగింది, కొత్త రోడ్డు వద్ద మాడుగుల శంకర్ జెండా ఆవిష్కరించడం జరిగింది.
ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో పోతుల కిష్టయ్య జండా ఆవిష్కరించడం జరిగింది.
కటిక దుకాణాల సెంటర్ వద్ద బండారి రాజు జెండా ఆవిష్కరించడం జరిగింది.
సోమవారం సంత వద్ద డి బ్రహ్మానందం జెండా ఆవిష్కరించడం జరిగింది. శ్రీరాంపూర్ బస్టాండ్ సెంటర్ లో ఎస్ తిరుపతి రెడ్డి జెండా ఆవిష్కరించడం జరిగింది. జి ఎల్ బి కే ఎస్ కార్యాలయం వద్ద జగన్నాథ్ సంతోష్ జండా ఆవిష్కరించడం జరిగింది. అరుణ అక్క నగర్ భీముని పోషం జండా ఆవిష్కరించడం జరిగింది.
ఎస్ & పి సి కార్యాలయం వద్ద కొలిపాక శ్రీనివాస్ జండా ఆవిష్కరించడం జరిగింది. శ్యామ్ నగర్ లో మంతెన రాయమల్లు జెండా ఆవిష్కరించడం జరిగింది. ఎస్ ఆర్ పి త్రీ మైన్ పై దొడ్డిపల్లి రాజయ్య జెండా ఎగరవేయడం జరిగింది. ఈ 140 మేడే జెండాల ఆవిష్కరణ
చికాగో అమరవీరుల, మేడే స్ఫూర్తి తో కార్మికులకు నష్టం చేసే లేబర్ కొడ్స్ రద్దు కై పోరాటాలకు పిలుపునివ్వడం జరిగింది.
ఈ సందర్బంగా *డి బ్రహ్మానందం ( ఐ ఎఫ్ టి యు) భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర నాయకులు* మాట్లాడుతూ శ్రమకు తగ్గ వేతనాలు, పని పరిస్థితుల మెరుగుదల, పనిగంటలను తగ్గింపులకై కార్మిక వర్గం పోరాడిందని, మే ఒకటి 1886న అమెరికాలోని చికాగో లో 8 గంటల పని దినాన్ని డిమాండ్ చేస్తూ కార్మికులు నిరసనలు, ఆందోళనలు చేపట్టారని, పెట్టుబడిదారి వర్గం ఈ శాంతియుత ప్రదర్శనలపై కాల్పులు జరిపిందని, కార్మికులు తూటాలకు బలయ్యారని తిరుగుబాటు నాయకులను ఉరితీసారని కేసులు పెట్టి తీవ్ర అణిచివేతకు పాల్పడి జైలు శిక్షలు విధించారనీ, ఈ కార్మికుల బలిదానాల రక్త తర్పణలు చరిత్రలో నిలిచిపోయిందని అన్నారు.
8 గంటల పని దినం కావాలని, కనీస వేతనం 30 వేల రూపాయలు ఇవ్వాలని, పని ప్రదేశాల్లో భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ మరియు స్కీం వర్కర్లను సింగరేణి కాంటాక్ట్ కార్మికులను, రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు, నాలుగు లేబర్ కోడ్ ల అమలుతో యూనియన్ ఏర్పాటు చేయడం, సమ్మె చేయడం సాధ్యం కాదు. కార్మికుల పని గంటల్లో 10 నుండి 12 గంటలు విధానాన్ని ప్రవేశపెట్టారు. కార్పొరేట్ పెట్టుబడి దారులకు కార్మికుల రక్తాన్ని ధరబోసే చట్టాలను కేంద్రం చేస్తూ, కార్మికులను బానిసలుగా మారుస్తున్నదని, లేబర్ కోడ్స్ రద్దుకై పోరాటాన్ని ఉధృతం చేయండి అనే పిలుపుతో 140 వ మే డే సందర్భంగా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా నాయకులు సదానందం, యాదగిరి, శంకర్ సత్యం, సింగరేణి కాలరీస్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ డివిజన్ నాయకులు మంతెన లచ్చన్న, అప్పారావు, సుధాకర్, ముత్యాల సంతోష్, పక్కన ఏం శంకర్ కిరణ్ బాపు, ఈశ్వర్ ఐలయ్య, అప్పలరాజు, రమ, రాజేశ్వరి, నరసమ్మ, కాలేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.komuraiahramadugu12@gmail.com
komuraiahramadugu12@gmail.com
రామడుగు కొమురయ్య ఎడిటర్
నేటి ఇజం






0 Comments