అనుమతుల్ నిల్,ప్రచారం ఫుల్
మంచిర్యాల: మే 08/05/2026:(నేటి ఇజం)
మంచిర్యాల జిల్లాలోని కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఎలాంటి విద్యాశాఖ, మున్సిపాలిటీ అనుమతులు లేకుండా పాఠశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ విచ్చలవిడిగా హైవే రోడ్ల నుండి మొదలుకొని గల్లీలలో కాలనీ వరకి ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ బ్యానర్లతో, కరపత్రాలతో విచ్చలవిడిగా ప్రచారం చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులను మభ్యపెడుతూ అడ్మిషన్లు పొందుతున్నారు.మంచిర్యాల జిల్లా నే కాక ఇతర జిల్లాలో కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు సంబంధించిన పాఠశాలల, కళాశాలల పెద్దపెద్ద కటౌట్స్ బ్యానర్లు హైవే రోడ్లపై గల్లీలలో కర పత్రాలతో అనుమతులు లేకుండా ప్రచారాలు చేస్తున్న యాజమాన్యాలపై మున్సిపాలిటీ అధికారులు, మంచిర్యాల కార్పొరేట్ మేయర్లు స్పందించి ప్రచారాల చేస్తున్న పాఠశాలల బ్యానర్లను తొలగించి చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU కోరుతున్నాం.komuraiahramadugu12@gmail.com
komuraiahramadugu12@gmail.comరామడుగు కొమురయ్య ఎడిటర్
నేటి ఇజం


0 Comments