మంచిర్యాల పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనికి చేసిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్
మంచిర్యాల: 07/05/2026:(నేటి ఇజం)
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 22 వ డివిజన్ లోని *పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్నీ మధుకర్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన వైద్యుల అటెండెన్స్ రిజిస్టర్ ను,హాస్పిటల్ లో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలను,మందులను మేయర్ గారు పరిశీలించడం జరిగింది.
ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సకాలంలో అందుబాటులో ఉండాలని,అన్ని రకాల వైద్య పరీక్షలు,అవసరమైన చికిత్స అందించాలని,అత్యవసర పరిస్థితులలో మాత్రమే పెద్ద హాస్పిటల్ కు రెఫరల్ చేయాలని సిబ్బందికి సూచించారు.
అనంతరం DMHO వైద్యాధికరితో ఫోన్లో మాట్లాడి ఇక్కడ నెలకొన్న సమస్యలపైన తగిన సూచనలు చెయ్యడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి కంకణాల రోజాశ్యాంసుందర్ గార్లు,హాస్పిటల్ వైద్యులు,సిబ్బంది,స్థానికులు పాల్గొన్నారు
komuraiahramadugu12@gmail.com
ప్రియాంక స్టేట్ ఇంచార్జ్
నేటి ఇజం







0 Comments