తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)లోకి మాజీ మంత్రి బోడ జనార్దన్ టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో భేటీ త్వరలోనే అనుచరులతో కలిసి పార్టీలో చేరనున్న మాజీ మంత్రి


 తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)లోకి మాజీ మంత్రి బోడ జనార్దన్

టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో భేటీ

త్వరలోనే అనుచరులతో కలిసి పార్టీలో చేరనున్న మాజీ మంత్రి

హైదరాబాద్ :01/05/2026:(నేటి ఇజం)

మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బోడ జనార్దన్ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) లో చేరనున్నారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలోనే తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరుతానని తెలిపారు. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో టీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. బోడ జనార్దన్ ప్రస్తుత మంచిర్యాల జిల్లా చెన్నూరు శాసన సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్ టీ రామారావు ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు

komuraiahramadugu12@gmail.com

నేటి ఇజం

Post a Comment

0 Comments