ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీకి వ్యతిరేకంగా ధర్నా పోస్టర్ విడుదల
మంచిర్యాల జిల్లా: తాండూరు:25/04/2026:(నేటి ఇజం)
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం: ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న భారీ ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అధ్యక్షుడు వాసాల అనిల్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టడం అత్యవసరమని పేర్కొన్నారు. విద్య హక్కు చట్టం 2009ను కచ్చితంగా అమలు చేయడంతో పాటు, ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ధర్నాకు జిల్లాలోని ప్రజలు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.సమాజంలో అసమానతలు తొలగి సమానత్వం, సామాజిక న్యాయం సాధ్యమవ్వాలంటే విద్య హక్కును పకడ్బందీగా అమలు చేయడం అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ సోషల్ మీడియా మొహమ్మద్ లతీఫ్, మండల నాయకులు భద్రపు శ్రీధర్, MD పాషా, జూలూరి వెంకటాచార తదితరులు పాల్గొన్నారు.komuraiahramadugu12@gmail.com

0 Comments