చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించిన- వేద బ్రాహ్మణులు సత్యనారాయణ,గుడి అరుణ్ శర్మ, శశిధర్ శర్మ

 చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించిన- వేద బ్రాహ్మణులు సత్యనారాయణ,గుడి అరుణ్ శర్మ, శశిధర్ శర్మ

రామగుండం : అంతర్గాం : నేటి ఇజం:15/03/2026

చెన్నకేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహణకు సహాయ సహకారాలు అందించిన_ రాపోలు వంశస్థులు, కుటుంబ సభ్యులు

 పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మురుమూరు గ్రామంలో గ్రామ దేవత అయినటువంటి చెన్నకేశవస్వామి కళ్యాణ మహోత్సవం వేద బ్రాహ్మణుల తో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వేద బ్రాహ్మణులు సత్యనారాయణ, శశిధర్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా కొలిసే అటువంటి గ్రామ దేవత శ్రీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని చెన్నకేశ్వర స్వామి ఆలయంలో రాపోలు వంశస్థుల సహాయ సహకారాలతో చెన్నకేశవ స్వామిని పల్లకిలో ఊరేగించి మూడు రోజులు ఈ పండుగను నిర్వహించుకోవడం జరిగిందని భక్తులు చెన్నకేశవ స్వామిని వరాలు అడగడంతో అనేక వరాలు ఇచ్చే గ్రామ దేవత శ్రీ చెన్నకేశవ స్వామి అని గ్రామ ప్రజలకు నమ్మకంతో దీనికి గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణం లో పాల్గొనడం జరిగిందని కొలిచే భక్తులకు కోరికలను ఇచ్చే అటువంటి గ్రామ దేవత చెన్నకేశ్వర స్వామి అని భక్తులు భక్తిశ్రద్ధలతో మూడు రోజులు ఒక గొప్ప పండుగలాగా జరుపుకోవడం జరుగుతుందని ఈ మహోత్సవం జరగడానికి ముఖ్యులు అయినటువంటి రాపోలు వంశస్థులు రాపోలు వంశస్తులకు ఆ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ చెన్నకేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని వేద బ్రాహ్మణులు సత్యనారాయణ శర్మ శశిధర్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద బ్రాహ్మణులు గుడి అరుణ్ శర్మ, సత్యనారాయణ శర్మ, శశిధర్ శర్మ ,పనిదర్ శర్మ, జగదీష్ శర్మ, సుమంత్ శర్మ, వినోద్ శర్మ, భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments