నేటి ఇజం: చెన్నూరు: 06/03/2026
Chennur Mjp residential school ,మంచిర్యాల,లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి నాగవర్ధన్ మార్చి 4 వ తేదీ నుంచి కన్పించడం లేదు.
పాఠశాల కు ఎటువంటి కాంపౌండ్ లేదు. గతంలో ఎన్నిసార్లు RCO శ్రీధర్,, ప్రిన్సిపాల్ శ్రీకాంత్ కి పేరెంట్స్ కంప్లైంట్ చేసిన పట్టించుకోక పొగ ఉంటే ఉండండి లేకపోతే tc తీసుకుని పోండి అంటూ దురుసుగా ప్రవర్తించటం జరిగింది. కొంతమంది విద్యార్థులు tc తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా ఖాళీ అయిన సీట్లను 30 వేల నుండి 50 వేల వరకు డబ్బులు తీసుకొని విద్యార్థులను అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. బిల్డింగ్ యజమానుల నుండి డబ్బులు తీసుకొని ఎటువంటి సౌకర్యాలు లేకున్న వారికి అడ్వాన్స్ రెంట్ ఇచ్చి కొనసాగిస్తున్నాడు. RCO శ్రీధర్ బిల్డింగ్ యజమాని నుండి రెన్యువల్ కొరకు కలెక్టర్ పేరుచెప్పి డబ్బులు డిమాండ్ చేసిన ఆరోపణలు ఉన్నవి. అడ్మిషన్స్ లో ఎటువంటి పారదర్శకత పాటించకుండా గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకుంటున్న RCO శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు , విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. గ్రేడ్ 1 ప్రిన్సిపాల్ అయివుండి 6 to 10 వరకు ఉన్న స్కూల్ లో 7 సంవత్సరాల నుండి ఉంటూ ప్రిన్సిపాల్, DCO, RCO అన్ని తనవద్దె ఉంచుకొని స్థానికంగా తనకున్న పలుకుబడిని ఉపయోగించి అక్రమాలకు పాల్పడుతున్న RCO ని తక్షణమే సస్పెండ్ చేయాలని, అడ్మిషన్స్ పై నిష్పక్షపాతంగా విచారణ జరిపి RCO, ప్రిన్సిపాల్ పై చర్య తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

0 Comments