4/2/2025
మంచిర్యాల నేటి ఇజం,/జైపూర్
జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు ఆర్టీసీ బస్సు ఆపాలి. PDSU
మంచిర్యాల జిల్లా జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు ఆర్టీసీ బస్సు ఆపాలని ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో మంచిర్యాల ఆర్టీసీ డిపో కార్యాలయంలో అసిస్టెంట్ డిపో మేనేజర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా PDSU జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ మాట్లాడుతూ.. జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 160 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ యొక్క కాలేజీలో 50 మంది అమ్మాయిలు కూడా చదువుకుంటున్నారు. కానీ కళాశాల ముందు ఆర్టీసీ బస్సు ఆపకపోవడంతో అమ్మాయిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున అమ్మాయిల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కళాశాల ముందు బస్సు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని PDSU విద్యార్థి సంఘంగా కోరడం జరిగింది. దీనిపై స్పందించిన ఆర్టీసీ అసిస్టెంట్ డిపో మేనేజర్ శ్రీలత గారు ఆర్టీసీ వారికి కళాశాల విద్యార్థుల యొక్క సమస్యను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా కోశాధికారి జి. సౌమ్య, అంజలి, అను తదితరులు పాల్గొన్నారు.

0 Comments