రెండు నెలల రజక పసిపాపను హత్య చేసిన అగ్రకులాల పెత్తందారులను కఠినంగా శిక్షించాలి.* *గ్రామ సర్పంచును వెంటనే అరెస్టు చేసి ఉరి తీయాలి..* *నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులు సస్పెండ్ చేయాలి* *రజకరాష్ట్ర సహాయ కార్యదర్శి తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సింగారం రమేష్


*రెండు నెలల రజక పసిపాపను హత్య చేసిన అగ్రకులాల పెత్తందారులను కఠినంగా శిక్షించాలి.* 

*గ్రామ సర్పంచును వెంటనే అరెస్టు చేసి ఉరి తీయాలి..*

 *నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులు సస్పెండ్ చేయాలి*

*రజకరాష్ట్ర సహాయ కార్యదర్శి తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సింగారం రమేష్

నేటి ఇజం:

 మంగళవారం 24 : యాదాద్రి భువనగిరి

 జిల్లా కేంద్రంలో రైతుబజార్ ఎదురుగా సంఘం ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రజకులపై దాడి చేసి, పసిపాపను హత్య చేసిన అగ్రకుల పెత్తందారున్నీ వెంటనె అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలి.ఈ సందర్భంగా రజక వృత్తిదారుల సంఘం సింగారం రమేష్ మాట్లాడుతూ, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో గత బుధవారం రోజున మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రజక దంపతులు స్వామివారి దర్శనం కోసం గుడిలోకి ప్రవేశించగా రజక కులస్తులు టికెట్టు లేకుండా గుడిలోపలకి రావద్దు అని రజకులపై దాడి చేయడం దుర్మార్గమని అన్నారు.కుటుంబ సభ్యులు మాపై దాడి జరపొద్దని, బాధితులు పెత్తందారుల కాలపై పడి దండం పెట్టారు. 

కీర్తి తన రెండు నెలల బిడ్డను పెత్తందారు శ్రీనివాసరెడ్డి కాళ్లపై వేసి కొట్టొద్దని ప్రాధేయపడ్డ కనికరించకుండా ఆవేశంతో ఊగిపోయిన పెత్తందారులు, బిడ్డను కాళ్లతో తన్ని విసిరేశారు. దీనితో ఆ బిడ్డ కొన ఊపిరితో అపస్మారస్థితిలోకి వెళ్లిపోవడం జరిగింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆ పసిపాప మృత్యువుతో పోరాడి శనివారం రోజు మరణించిందని అన్నారు.ఇంత జరుగుతున్న పోలీసు యంత్రాంగం బాధితుల పక్షాన కేసు నమోదు చేయకుండా బాధితులపైనే తిరిగి కేసు నమోదు చేశారని అగ్రకులాల పెత్తందారులకు పోలీసులు వత్తాసు పలకడం సరైనది కాదని  అన్నారు. దోషులను కఠినంగా శిక్షించకుండా  పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరైనది కాదని, పసిపాప హత్యకు కారణమైన దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించే వరకు మా పోరాటం కొనసాగుతుందని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రజకులపై దాడులను ఇలాంటి అరాచకాలను  ఆపేందుకు రజకులకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని,ఈ సందర్భం డిమాండ్ చేశారు.

 

Post a Comment

0 Comments