విద్యారంగానికి కనీసం 20% నిధులు కేటాయించాలి.PDSU జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ డిమాండ్.



 విద్యారంగానికి కనీసం 20% నిధులు కేటాయించాలి.PDSU

జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ డిమాండ్...

నేటి ఇజం: చెన్నూర్: 23/02/2026

చెన్నూర్ పట్టణ కేంద్రంలో PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో  విద్యార్థులతో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో PDSU జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ మాట్లాడుతూ...

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలో జరిగే  అసెంబ్లీ సమావేశం లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్య రంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తానని ఎన్నికల ముందు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.అంతేకాకుండా  కొన్ని సభలలో విద్యారంగానికి 15% నిధులు కేటాయించి.విద్యను అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లో విద్య రంగాన్ని అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం బడ్జెట్  విద్యారంగానికి కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం(PDSU) డిమాండ్ చేస్తుంది.లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమం లో నాయకులు అవినాష్,సురేష్, రాజు, కవిత, కీర్తన, రమ్య, తదితరులు పాల్గొన్నారు.

డిమాండ్స్:

విద్యా రంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి.

Sc,ST,BC హాస్టల్ విద్యార్థులకు సొంత భవనాలు నిర్మించాలి

పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్,ఫీజు రీయిమెంట్ విడుదల చేయాలి.

Post a Comment

0 Comments