*గోపి రజక దీక్షలో మాట్లాడుతూ
*చిన్నారిని చంపిన 8 మంది రెడ్లపై హత్యా కేసు నమోదు చేయాలి*
★ కలెక్టర్ చొరవ తీసుకుని తుకారంరెడ్డి సర్పంచ్ పదవి నుంచి తొలగించాలి
తేది:23-2-2026 సోమవారం : నేటి ఇజం:
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవంలో రజక కుటుంబాన్ని అతిదారుణంగా కొట్టి రెండు నెలల బేబీని కాలితో తన్ని హత్య చేసిన హంతకులైన 8 మంది రెడ్ల మీద తక్షణం హత్య కేసు పెట్టడమే కాకుండా తుకారాం రెడ్డిని సర్పంచ్ పదవి నుంచి తొలగించాలని కలెక్టర్ ను కోరుకుంటున్నాం. ఎనిమిది మంది రెడ్లపై హత్యకేసు పెట్టె వరకు న్యాయం పోరాటం చేస్తామని దీక్షలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక అన్నారు
కార్యక్రమంలో వివిధ రజక సంఘాల రాష్ట్ర నాయకులు, రాజకీయ నాయకులు,నేషనల్ ధోబి రిజర్వేషన్ సంఘ్ జాతీయ అధ్యక్షులు నడిమింటి శ్రీనివాస్, రజక ఉద్యోగుల సంఘం నాయకులు రైల్వే శ్రీనివాస్,జిల్లా అధ్యక్షుడు గోవిందు బాలస్వామి , జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింగరాజుల ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులు సుంకరి బాలకృష్ణ, జిల్లా కార్యదర్శి గున్న సురేష్,పట్టణ అధ్యక్షులు కొట్ర మల్లేష్, ప్రధాన కార్యదర్శి మల్లేష్,బిజినేపల్లి అధ్యక్షులు శ్రీనివాస్,గుడ్లనర్వ బాలస్వామి ,రాములు , కృష్ణ వివిధ రజక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు



0 Comments