పత్రిక ప్రకటన: *దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన కార్మిక వర్గానికి ఐ ఎఫ్ టీ యు. విప్లవ జే జే లు* ఈ రోజు దేశ వ్యాప్త సమ్మె సందర్భంగా ఐ ఎఫ్ టీ యు ఆధ్వర్యంలో గోదావరిఖని గాంధీ చౌరస్తా లో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా *ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ



 

నేటి ఇజం:తేది:12-02-2026.: గోదావరి ఖని


దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన కార్మిక వర్గానికి ఐ ఎఫ్ టీ యు. విప్లవ జే జే లు


      ఈ రోజు దేశ వ్యాప్త సమ్మె సందర్భంగా ఐ ఎఫ్ టీ యు ఆధ్వర్యంలో గోదావరిఖని గాంధీ చౌరస్తా లో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది.

        ఈ సందర్భంగా *ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ* మాట్లాడుతూ స్వేచ్చా వాణిజ్యం పేరుతో బీ జే పీ మోడీ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న ఒప్పందం దేశ రైతాంగాన్ని, వ్యవసాయరంగాన్ని నాశనం చేస్తుందని,కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను,హక్కులను, స్వేచ్చను హరించి వేస్తుందని,బీ జే పీ విధానాలు ఈ దేశ మెజారిటీ శ్రమ జీవులైన శ్రామిక ప్రజల జీవన విధానంను సర్వం అస్తవ్యస్తం చేస్తుందని,ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రజలు,రైతులు,కార్మికులు మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని లేకుంటే భవిష్యత్ అంధకారమే అని స్పష్టం చేశారు.

        బీ జే పీ మోడీ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం,నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దుచేయాలని,మహత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పధకానికి తూట్లు పొడిచి,రాబోయే కాలంలో ఆ పథకాన్ని రద్దు చేసే వి బి జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


         కేంద్ర బీ జే పీ మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడుల కాఫీలను దగ్ధం చేయడం జరిగింది.

        ఈ సందర్భంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం రద్దు చేసుకోవాలని,కార్మికులకు నష్ట కరమైన నాలుగు లేబర్ కోడ్ ల అమలును వెనక్కితీసుకోవాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యదావిధిగా కొనసాగించాలని,విత్తన, విద్యుత్ సవరణ బిల్లులను రద్దుచేయాలని డిమాండ్ చేశారు.

       ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టీ యు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ జిల్లా నాయకులు ఈదునూరి రామకృష్ణ,ఐ రాజేశం, ఎం దుర్గయ్య, ఎడ్ల రవికుమార్, ఎం కొమరయ్య, ఎస్ ప్రసాద్, చింతల శేఖర్, రాయపోచం,కే ధర్మేందర్, ఈ మొండయ్య,ప్రేమ్ కుమార్.తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments