మంచిర్యాల పట్టణంలో నిన్న రాత్రి హమాలివాడలోని పెద్దమ్మ టెంపుల్ లో జరిగిన దొంగతనం లో నిందితుడు గుమ్మడి సారయ్య వయస్సు 47 సంవత్సరములు నీ పట్టుకోవడం జరిగింది. పట్టణ ఎస్ఐ తిరుపతి గారి వివరాల ప్రకారం నిందితుడు గుమ్మడి సారయ్య


నేటి ఇజం: మంచిర్యాల: 21/02/2026
 

మంచిర్యాల పట్టణంలో నిన్న రాత్రి హమాలివాడలోని పెద్దమ్మ టెంపుల్ లో జరిగిన దొంగతనం లో నిందితుడు గుమ్మడి సారయ్య వయస్సు 47 సంవత్సరములు నీ పట్టుకోవడం జరిగింది. పట్టణ ఎస్ఐ తిరుపతి గారి వివరాల ప్రకారం నిందితుడు గుమ్మడి సారయ్య అనే వ్యక్తి నిన్న రాత్రి హమాలివాడలోని పెద్దమ్మ టెంపుల్ లో హుండీ పగలగొట్టి మూడు వేల రూపాయలు దొంగతనం చేయడం జరిగింది. దీని గురించి విచారించగా గత సంవత్సరం నవంబర్లో జరిగిన MCC లోని పోస్ట్ ఆఫీస్ లో రెండు మానిటర్లు కీబోర్డ్ మరియు జనరేటర్లు, అలాగే ఈనెల 19.02.2026 రోజున హమాలివాడలోని హనుమాన్ టెంపుల్ లో 5000 రూపాయలు దొంగతనం చేసినట్టు తమ విచారణలో నిందితుడు నిజం ఒప్పుకున్నట్టు పట్టణ ఎస్ఐ తెలపడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరచడం జరిగింది.

Post a Comment

0 Comments