షాద్ నగర్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మెబాట నేడు బస్సులు బంద్ - ప్రయాణికుల తీవ్ర ఇక్కట్లు ఆర్టీసీ డిపోలో ఎక్కడికి అక్కడే నిలిచిపోయిన బస్సులు



 షాద్ నగర్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మెబాట

 నేడు బస్సులు బంద్ - ప్రయాణికుల తీవ్ర ఇక్కట్లు

 ఆర్టీసీ డిపోలో ఎక్కడికి అక్కడే నిలిచిపోయిన బస్సులు

హైదరాబాద్: షాద్ నగర్: 22/04/2026:(నేటి ఇజం)

షాద్ నగర్ వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వంతో నిన్న(మంగళవారం) జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచే బస్సులను నిలిపివేశారు కార్మికులు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాల్సిందే అంటూ ఆర్టీసీ జేఏసీ సమ్మె సైరన్ మోగించింది. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలో ఆర్టీసీ డిపోలో బస్సులను పూర్తిగా నిలిపివేశారు. కార్మికులు సమస్యలను ముగించి డిపోలో తెల్లవారుజామునుండే బంద్ పాటించారు. ముందస్తు చర్యగా పోలీసులు డిపోలో మోహరించారు. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రజలు షాద్ నగర్ లో ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కాగా, ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన 32 హామీలను నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు.komuraiahramadugu12@gmail.com

komuraiahramadugu12@gmail.com
నేటి ఇజం

Post a Comment

0 Comments