అగ్ర వర్గ పెత్తందారుల దాష్టికానికి పసిపాప బలి.*



 *అగ్ర వర్గ పెత్తందారుల దాష్టికానికి పసిపాప బలి.* 

నేటి ఇజం: హైదరాబాద్: 22/02/202

పసిపాపను హత్య చేసిన అగ్రకులాల పెత్తందారులను కఠినంగా శిక్షించాలి. 

 రజక వృత్తి వృత్తిదారుల సంఘం 

 గ్రేటర్ హైదరాబాద్ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో, ముషీరాబాద్ గోల్కొండ  X ఎక్స్ రోడ్ నందు, నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో *రజకులపై దాడి చేసి, పసిపాపను హత్య చేసిన అగ్రకుల పెత్తందారుల దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.* ఈ సందర్భంగా వృత్తి సంఘాల కో కన్వీనర్  గుమ్మడి రాజు నాగరాజు మాట్లాడుతూ, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో గత బుధవారం రోజున మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రజక దంపతులు స్వామివారి దర్శనం కోసం గుడిలోకి ప్రవేశించగా రజక కులస్తులు టికెట్టు లేకుండా గుడిలోపడికి రావద్దు అని రజకులపై దాడి చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు.కుటుంబ సభ్యులు మాపై దాడి జరపొద్దని, బాధితులు పెత్తందారుల కాలపై పడి దండం పెట్టారు. కీర్తి తన రెండు నెలల బిడ్డను పెత్తందారు శ్రీనివాసరెడ్డి కాళ్లపై వేసి కొట్టొద్దని ప్రాధేయపడ్డ కనికరించకుండా ఆవేశంతో ఊగిపోయిన పెత్తందారులు, బిడ్డను కాళ్లతో తన్ని విసిరేశారు. దీనితో ఆ బిడ్డ కొన ఊపిరితో అపస్మారస్థితిలోకి వెళ్లిపోవడం జరిగింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆ పసిపాప మృత్యువుతో పోరాడి శనివారం రోజు మరణించిందని ఆయన అన్నారు. ఇంత జరుగుతున్న పోలీసు యంత్రాంగం బాధితుల పక్షాన కేసు నమోదు చేయకుండా బాధితులపైనే తిరిగి కేసు నమోదు చేశారని అగ్రకులాల పెత్తందారులకు పోలీసులు వత్తాసు పలకడం సరైనది కాదని ఆయన అన్నారు. దోషులను కఠినంగా శిక్షించకుండా  పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరైనది కాదని, పసిపాప హత్యకు కారణమైన దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించే వరకు మా పోరాటం కొనసాగుతుందని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. 

హైదరాబాద్ సెంట్రల్ జిల్లా *కార్యదర్శి, మరియల గోపాల్* మాట్లాడుతూ,రోజురోజుకి అగ్రకుల పెత్తందారులు అత్యంత వెనుకబడిన రజకులపై దాడులు చేస్తూ హత్యలు గావించే స్థాయికి అగ్రకులస్తులు ఉన్నారని నెలలు నిండిన పసిబిడ్డని నిర్ధాక్షణంగా దుర అహంకారంతో హత్య చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. నిందితులని తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి నష్టపరిహారాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రజకులపై దాడులను ఇలాంటి అరాచకాలను అడ్డు ఆపేందుకు రజకులకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఐద్వా నగర అధ్యక్షురాలు, పద్మ సిఐటియు నగర కార్యదర్శి, జె కుమార్, కేవీపీఎస్, నగర కార్యదర్శి ఎం మహేందర్, హెచ్ సి ఎఫ్ నగర నాయకులు ఎం శ్రీనివాసరావు, వీరయ్య ఎన్ పి ఆర్ డీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ వెంకటేష్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి అశోక్ రెడ్డి  రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పెద్దాపురం భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ నగర నాయకులు నరేష్,రాములు,,మహేందర్,రమేష్,రాజు   రజక సంఘం జిల్లా నాయకులు, పి భాస్కరరావు, సిహెచ్ నాగేష్,బాబు రమేష్, కేశవులు,గోపి, తుల్జారం,మంగయ్య తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments